చిన్నబోయినపల్లి నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరికలు
తెలంగాణ జ్యోతి ఎటునాగారం ప్రతినిధి : మండల పరిధిలోని చిన్న బోయినపల్లి బిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు గుజేటి రాజశేఖర్, వైస్ ఎంపీపీ సంజీవరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 45 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గోగుపల్లి, శివపురం,పెద్ద వెంకటాపురం, చిన్న బోయినపల్లి పల్లి గ్రామాల నుండి మెట్టు రవి, ఎస్.కె సయ్యద్, ఎట్టి రాము ఎట్టి అచ్చయ్య, మాదారపు శివప్రసాద్, భూషని సాంబయ్య, మేకల నర్సయ్య, రహీం, జక్కుల రాజు, షఫీ, మెట్టు శివ, అడ్డురి సుమంత్, మేకల రమేష్, దుబ్బ శ్రీను, తిప్పన బోయిన శేఖర్, ముద్దబోనా నీకీల్, ఎట్టి మహర్షి, ఎస్.కె ఖలీల్ పాషా, ఎస్.కె సుభాన్, చేల హేమంత్ మీర్యాల రాజు, రేగా సాయి, మేకల అశోక్ లు స్వచ్ఛందంగా చేరారు.