కాంగ్రెస్ కోటలకు బీటలు.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన 50. దళిత కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీ లో చేరారు. నూగూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్,వాజేడు, వెంకటాపురం మండలాల బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్, బోదెబోయిన.బుచ్చయ్య ఆధ్వర్యంలో వాజేడు మండలం పేరూరు గ్రామానికి చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన సుమారు 50 కుటుంబాలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ నేత బి. బుచ్చయ్య మాట్లాడుతూ..భద్రాచలం నియోజకవర్గం లో ఉన్న దళిత కుటుంబాల అందరికీ దళిత బంధు పథకం పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని, ప్రతి ఒక్క దళిత కుటుంబానికి ఒకేసారి లబ్ధి చేకూర్చేలా.. కెసిఆర్ పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోవడం జరిగిందని తెలియజేశారు. అర్హులైన దళిత కుటుంబాలు అందరికీ దళిత బంధు పథకం వర్తించేలా మంజూరయ్యాలా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తారని తెలిపారు. దళిత బందు మంజూరు కోసం మాయమాటలు తో కమిషన్లు తీసుకున్న మోసగాళ్ల పార్టీని తరిమి కొట్టాలని, కారు గుర్తుకు ఓటు వేసి ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, ప్రజా వైద్యులు డాక్టర్ తెల్లం వెంకటరావు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాజేడు మండల బిఆర్ఎస్ పార్టీ, అధ్యక్ష కార్యదర్శి, పెనుమల్లు రామకృష్ణారెడ్డి, సోమిడి నరసింహారావు,అధికార ప్రతినిధి చెన్నం.మల్లయ్య, జడ్పిటిసి తల్లాడి పుష్పలత,స్థానిక సర్పంచ్, యాలం సరస్వతి, ఆత్మ కమిటీ డైరెక్టర్ గొడుగులూరు మోహన్ రావు, యూత్ కార్యదర్శి బొల్లే.ఆదినారాయణ, ఎంపీటీసీ గుడివాడ చంద్రశేఖర రావు, గోవర్ధన్ శేషగిరి స్వామి, మరియు గ్రామ అధ్యక్ష కార్యదర్శులు, వార్డు మెంబర్లు, పార్టీ కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.