కలం కార్మికులకు తక్షణమే ఇండ్ల స్థలాలు పంపిణి చేయాలి
– గుడిసెలు తొలగిస్తే ఐక్యంగా ఉద్యమిస్తాం:గుండెబోయిన రవిగౌడ్
తెలంగాణ జ్యోతి, నవంబర్ 17, వెంకటాపూర్ ప్రతినిధి : వెంకటాపూర్ మండలం పాలంపేట లో గల సర్వే నంబర్ 14 లోని ప్రభుత్వ భూమి లో వెంకటాపూర్ మండల జర్నలిస్టులు గుడిసెలు వేసుకోవడం జరిగిందని, వారికి తక్షణమే ఇండ్ల స్థలాలు పంపిణీ చేయాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెబోయిన రవిగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలం కార్మికులు ఇండ్ల స్థలాల కోసం దీక్షలు చేయడం బాధాకరమని అన్నారు. ఈమేరకు ఆయన శుక్రవారం పాలంపేట్ కి చేరుకొని జర్నలిస్టుల కు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రవిగౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం లో కలం కార్మికుల పాత్ర ఎంతో కీలకమైందని అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిరంతరం పనిచేసే జర్నలిస్టులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరైంది కాదన్నారు. కలం కార్మికులకు గత పది సంవత్సరాల నుండి ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పిన ఇంతవరకు అమలు చేయక పోవడం సమంజసం కాదని అన్నారు. ఇప్పటికైనా వెంకటాపూర్ కలం కార్మికుల కు అధికారులు స్పందించి ఇండ్ల స్థలాలు పంపిణి చేయాలనీ రవిగౌడ్ కోరారు.అధికారులు ప్రభుత్వం స్పందించక పోతే అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జర్నలిస్ట్ లకు మద్దత్తు గా పోరాటాన్ని ఉదృతం చేస్తామని రవిగౌడ్ అన్నారు.ఈ కార్యక్రమంలో గుట్ట మీద ముసలయ్య ఆలయ ప్రచార కార్యదర్శి గుండామీది వెంకటేశ్వర్లు , జర్నలిస్టులు బేతి సతీష్, ఒద్దుల మురళీ, దేశిని మహేందర్, పిల్లలమర్రి శివ, మామిడిశెట్టి ధర్మ, రంగీశెట్టి రాజేందర్, తీగల యుగేందర్, కందికొండ అశోక్, మునిగాల రాజు , దండపెళ్లి సారంగం,తదితరులు పాల్గొన్నారు.