ఓపెన్ టెన్త్, ఇంటర్ కు ప్రత్యేక అడ్మిషన్ల ప్రక్రియ.
– ములుగు బాలురఉన్నత పాఠశాల కోఆర్డినేటర్ విజయమ్మ
తెలంగాణ జ్యోతి, నవంబర్ 14, ములుగు ప్రతినిధి: జిల్లాలోని నిరుద్యోగులు, చిరు ఉద్యోగులు,గృహిణులు, చదువుకోవాలనే ఆసక్తి ఉండి పాఠశాల విద్య చదువుకో లేకపోయిన వారికోసం ఓపెన్ టెన్త్, ఇంటర్ లో ప్రత్యేక అడ్మిషన్ల ప్రక్రియ మొదలైనట్లు ములుగు బాలురఉన్నత పాఠశాల కోఆర్డినేటర్ విజయమ్మ తెలిపారు. దూర విద్యా విధానం ద్వారా పదవ తరగతి, పదవ తరగతిలో ఉత్తీర్ణులైన వారు రెగ్యులర్ ఇంటర్ చదవలేకపోయిన వారికి దూర విద్యా విధానం ద్వారా ఇంటర్ చదువుకోవడానికి తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం దూర విద్యా విధానాన్ని అందిస్తున్నదన్నారు. అందులో భాగంగా 2023 – 24 విద్యా సంవత్సరంలో ఓపెన్ టెన్త్ మరియు ఓపెన్ ఇంటర్ లో చేరడానికి చివరి అవకాశంగా ప్రత్యేక అడ్మిషన్ల ప్రక్రియను ఈ నెల 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు రాష్ట్ర అధికారులు అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ములుగు పరిసర గ్రామాల విద్యా అభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 10వ తరగతిలో చేరుటకు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, కుల దృవీకరణ పత్రము, ఆధార్ జిరాక్స్, ఒక ఫోటో, అదేవిధంగా ఓపెన్ ఇంటర్ లో చేరుటకు పదవ తరగతి మెమో, కుల దృవీకరణ పత్రము, ఆధార్ జిరాక్స్, ఫోటో లతో ములుగు బాలుర ఉన్నత పాఠశాల సహాయ కోఆర్డినేటర్ శిరుప కుమార్ ను సంప్రదించాలన్నారు.