ఐకేపీ సెంటర్ ను సందర్శించిన జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: శంకరంపల్లి, ధన్వాడ ఐకేపీ సెంటర్ లలో వడ్లు కొనుగోలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో తెలంగాణా రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు శుక్రవారం ఐకేపీ సెంటర్ లను జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు సందర్శించారు. చివరి గింజ వరకు కొంటామని,ప్యాడి పట్టిన తరువాత ఎటువంటి కటింగ్ లేకుండా కొనుగోలు చేస్తామని అన్నారు.తూకం లేకుండా రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామని, రైస్ మిల్లర్లు తో మాట్లాడి త్వరి తగతిన ఐకేపీ సెంటర్ యంత్రాoగం సాయంతో కోనుగోలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శంకరం పల్లి, దన్వాడ సర్పంచ్ లు అంగజాల అశోక్ కుమార్, జంగిలి నరేష్, పీఏసీఎస్ సీఈఓ ఎడ్ల సతీష్, ఉప సర్పంచ్ ముక్కెర రమ్య శ్రీ తిరుపతి, బొనగిరి శ్రీకాంత్, బొడిగా రాజిర్ గౌడ్, పోత ముక్తేష్, సిబ్బంది, రైతులు, హమాలీలు పాల్గొన్నారు.