ఎన్నికల సిబ్బంది శిక్షణ తరగతులకు హాజరు కావాలి

Written by telangana jyothi

Published on:

ఎన్నికల సిబ్బంది శిక్షణ తరగతులకు హాజరు కావాలి

  •  జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

తెలంగాణ జ్యోతి , భూపాలపల్లి ప్రతినిధి: జిల్లా కేంద్రంలో తేదీ 31 న ఉదయం 9:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2023 నకు సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, పోలింగ్ సిబ్బంది సకాలంలో హాజరు కావాలని జిల్లా ఎన్నికల అధికారి , జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎస్ఆర్ డిజి స్కూల్, బాలాజీ టెక్నో స్కూల్, మాంటిస్సోరి స్కూల్, జడ్పీహెచ్ఎస్ భూపాలపల్లి, నందు జిల్లాలో గల మొత్తం ఎన్నికల సిబ్బంది 1027 మందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుననీ ఈ ప్రకటనలో పేర్కొన్నారు.ఈ ట్రైనింగ్ కార్యక్రమానికి పోలింగ్ సిబ్బంది సకాలంలో హాజరు కావాలనీ, హాజరుకానియెడల (అర్.పి.) ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నిబంధన మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పోస్టల్ బ్యాలెట్ కోసం లేటెస్ట్ ఓటర్ కార్డు జిరాక్స్ , 3 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు వెంట తీసుకొని రావాలని జిల్లా ఎన్నికల అధికారి/ జిల్లా కలెక్టర్ తెలిపారు.

Tj news

1 thought on “ఎన్నికల సిబ్బంది శిక్షణ తరగతులకు హాజరు కావాలి”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now