ఉచిత బస్ సౌకర్యాన్ని రద్దు చేయాలి : ఆటో కార్మికులు

Written by telangana jyothi

Published on:

ఉచిత బస్ సౌకర్యాన్ని రద్దు చేయాలి : ఆటో కార్మికులు

– మా బ్రతుకులు ఆగమాగం : తెలంగాణ ఆటో కార్మికుల భారీ ర్యాలీ. 

– వెంకటాపురంలో ధర్నా, రాస్తారోకో. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, తమ కుటుంబా లను ఆదుకోవాలని కోరుతూ, తెలంగాణ ఆటో కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ములుగు జిల్లా వెంకటాపురం మండల కమిటీ గురువారం మండల కేంద్రంలో భారీ ర్యాలీ తో పాటు రాస్తారోకో నిర్వహించారు. ఉచిత బస్సు సౌకర్యంతో తమ బ్రతు కులు, జీవనో పాధి పూర్తిగా దెబ్బతిందని తమ కుటుంబాల్ని ఎలా పోషించుకోవా లని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉచిత బస్ సౌకర్యాన్ని రద్దుచేసి, ఆటో కార్మికులను, కుటుం బాలను ఆదు కోవాలని ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు నినాదాలు చేశారు. వెంక టాపురం మండల కేంద్రంలోని శివాల యం వద్ద నుండి వందల సంఖ్యలో ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్వాలీ ముందు భాగంలో ఆటో కార్మిక సంఘం నాయకులు, కార్మికులు నినాదాలు చేస్తూ భారీ ర్యాలీని నిర్వ హించారు. ఆటో నడుపుకుంటూ కుటుం బాలను పోషించు కుంటున్న తాము ఎలా బతకాలని  ప్రబుత్వం ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా వెంకటా పురం అంబేద్కర్ సెంటర్లో రోడ్డుపై బైఠాయించి, మహాలక్ష్మి పథకం, ఉచిత ఆర్టీసీ బస్సు సౌక ర్యాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేస్తూ, రాస్తా రోకో నిర్వహించారు. ఆటో కార్మికుల  బతుకులు  ఆగం  ఆగం అయ్యాయని, ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆటో కార్మికులు నినాదాలు చేశారు. ఆటో కార్మికుల ఆందోళన సందర్భంగా పెద్ద ఎత్తున వాహనాల రాకపోకలు స్తంభించిపోయింది. తమ ఆవేదన తమ బతుకు తెరువు గురించి ప్రభుత్వం పునరాలో చించాలని, రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిగా ఉన్న ఆటో కార్మికులను,కుటుంబాలను ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలంగాణ ఆటో కార్మికులు సంఘం వెంకటాపురం మండల కమిటి సభ్యులు,నాయకులు ఆటో డ్రైవర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now