ఇప్పగూడెం గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని, వాజేడు మండలం ఇప్పగూడెం గ్రామంలో శుక్రవారం ఉదయం వాజేడు పోలీసులు గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. వ్యవసాయ పనులు కారణంగా వేకువజామునె ఉదయాన్నే గ్రామస్తులను కలుసుకొనే విధంగా పోలీస్ శాఖ కృషి చేస్తున్నది. వాజేడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో గ్రామ ఆదివాసులకు వివిధ భద్రతాపరమైన అంశాలపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఎన్నికల సమయంలో కొన్ని అసాంఘిక శక్తులు గ్రామాల్లోకి వచ్చి ప్రజలను పెడ త్రోవ పట్టించే విధంగా చట్టవ్యతిరేకమైన పనులకు పాల్పడే అవకాశం ఉందని అటువంటి వారిపట్ల గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఓటర్లు స్వేచ్ఛాయిత, శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రభుత్వపరంగా, పోలీస్ శాఖ పరంగా విస్తృతంగా భద్రతాపరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై గ్రామస్తులకు ఎస్.ఐ.వెంకటేశ్వరావు అవగాహన కల్పించారు. గ్రామీణ యువత విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ముందుకు సాగాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామస్తులు సద్వీని యోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాజేడు సివిల్ పోలీస్ తో పాటు, సి.ఆర్. పి .ఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నా రు .