ఆదివాసీల హక్కుల సాధన కోసం ఉద్యమిద్దాం.
- జిఎస్పీ రాష్ట్ర కార్యదర్శి.పూనెం సాయి
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా వెంకటాపురంమండలం లోని దానవైయి పేట గ్రామంలో, గొండ్వానా సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా అధ్యక్షులు రేగ గణేష్ అధ్యక్షతన జి ఏస్. పి, రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి స్వామి పాల్గొని మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఆదివాసీల అభివృద్ధి,హక్కులు చట్టాల అమలు కోసం ,రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆదివాసీల గురించి ఏ మాత్రం పట్టించకోవడం లేదని,పాలక పక్షాల కు రానున్న ఎన్నికల్లో ఆదివాసీలు తప్పకుండా గుణపాఠం చెబుతారని హెచ్చరించారు., పొడు భూమి కోసం ఆదివాసులు దశాబ్దా కాలం నుండి పోడు కోసం నిరంతరంగా ఉద్యమం చేస్తూనే ఉన్నారని అన్నారు,గిరి వాసులు లేకపోతే అడవులు ఎప్పుడో అంతరించి పోయేవని, అడవిని కాపాడుతూ తమ పొట్టకూటి కోసం కొంత పోడు భూమిని సాగు చేసుకుంటే, దానిని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకోవడం దారుణమని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పదించి ఆదివాసీలకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలు అందరూ ఐక్యంగా ఉండి తమ సమస్యలు పరిష్కారం కోసం మన హక్కుల కోసం చట్టాల కోసం కృషి చేయాలని పిలుునిచ్చారు.ఈ కార్యక్రమంలో జి ఏస్ పి,ములుగు జిల్లా నాయకులు కణితి వెంకటకృష్ణ,పూనెం ప్రతాప్ పాయం కృష్ణ,ఆదివాసీ యువత కందుల రామకృష్ణ,ఇర్పా వెంకటేశ్వర్లు, బంగారి సత్యం,కోరం లక్ష్మీనారాయణ, వట్టం మహేష్,వట్టం రవి,ఇరప గోపాల్,కోరం సుదర్శన్, ఇరప ప్రవీణ్, అలేం సాయి,చెల దామోదర్,ఇరుప రాము,చేలే సాయి తదితరులు పాల్గొన్నారు.