అంగరంగ వైభవంగా కార్తీకదీపం మహోత్సవం.
-అశేషంగా తరలివచ్చిన భక్తజనం.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా మండల కేంద్రమైన వెంకటాపురం పట్టణం మంగపేట రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఆలయ కమిటీ ఆధ్వ ర్యంలో కార్తీకదీప మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకటాపురం పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామా లకు చెందిన వందలాది మంది మహిళలు తరలివచ్చి కార్తీక సోమ వారం దీపోత్సవం కార్య క్రమాల్లో పాల్గొని దీపారాధన చేశారు. అభయాంజనేయ స్వామి పూజా కార్య క్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ భక్తుల సౌకర్యర్దం ఆలయ సమీపంలో విద్యుత్ దీపాలు వెలుగులతో పాటు సౌకర్యాలు కల్పించారు. పదివేల 302 దీపాలు వెలిగించే కార్యక్రమంలో మహిళలు పాల్గొని దీపారాధనతో స్వామికి సకల జనులు సుఖశాంతులతో ఉండాలని, పాడి పంటలు సక్రమంగా పండాలని, దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అంటూ, స్వామిని వేడుకున్నారు. ఈ సందర్భంగా మంగపేట రోడ్ లోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ప్రాంగణం కార్తీకదీప మహోత్సవంతో, దీప కాంతుల ధగ ధగ లాడింది. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి మాల ధారణ భక్తులు, స్వామివారి ఆలయం ఎదుట ప్రత్యేక ప్రాంగణంలో, యాగం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీకదీపం మహోత్సవానికి తరలివచ్చిన వందలా ది మంది భక్తులకు స్వామివారి ఇష్ట పూర్వక ప్రసాదాలను ప్రతి ఒక్కరికి అందజేసి భక్తుల ఆదరాభిమానాలను ఆలయ కమిటీ పొందింది. వచ్చే ఏడాది కార్తీక మాసంలో తిరిగి పూజలు నిర్వహి స్తామని అందరిని చల్లగా చూసి ఆశీర్వదించాలని ఈ సందర్భంగా భక్తులు శ్రీ అభయాంజనేయ స్వామికి హారతితో, పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించి ఇష్టదైవాన్ని వేడుకున్నారు.