స్థానిక అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తాం.
- జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి దొర హెచ్చరిక.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా వాజేడు మండలం చింతూరు గ్రామంలో శనివారం జి. ఎస్.పి. ముఖ్య కార్యకర్తల సమావేశం రేగ గణేష్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి సాయి మాట్లాడుతూ వెంకటాపురం వాజేడు రెండు మండలాల్లో ఏ రాజకీయ పార్టీ నాయకులు రాకుండా అడ్డుకోవాలని,అవసరం అయితే వాజేడు, వెంకటాపురం ఆదివాసి గుడాళ్లల్లో స్థానిక అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తో ,ఆదివాసీలు బ్రతుకులు మారతాయని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, భద్రాచలం కేంద్రంగా ఆదివాసి జిల్లా చేస్తానని స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివాసులకు హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఆదివాసీ గ్రామాలను ముక్కలు చెక్కలుగా విభజించి పాలిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏ రాజకీయ పార్టీ నాయకులకు ఓట్లు వేయమని ముక్తకంఠంతో హెచ్చరించారు.భారత రాజ్యాంగంలో ఐదో షెడ్యూల్ ప్రకారంగా ఆదివాసులకు స్వయం పాలన నియమిస్తానని ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి హామీలను ఆదివాసులు నమ్మొద్దని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్రం కోసం ఆదివాసి విద్యార్థులు బలిదానం చేశారని దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని, ఆ మాటలు గాలికి వదిలేసారని ఆయన ప్రశ్నించారు., ఆదివాసి గుడాల్లోకి ఏ రాజకీయ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు రావద్దని వస్తే మాత్రం తరిమి కొడతామని ఆయన హెచ్చరించారు. బూర్జవ రాజకీయ పార్టీల కాళ్ళ కింద ఇంకా ఎన్నాళ్లు బతుకుతా మనీ ఆయన అన్నారు.స్వతంత్రం వచ్చి 70 ఏళ్లు గడుస్తున్నా కూడ రాజకీయ పార్టీ కాళ్ల కిందనే బతకటం ఇంకెన్నాళ్లు అన్నారు. భారత రాజ్యాంగంలో ఐద వ షెడ్యూల్ ప్రకారంగా ఏజెన్సీ ప్రాంతంలో భూమిపై నీటిపై, అడవిపై సర్వహక్కులు ఉన్నాయని, ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసినప్పటికీ ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదు అని ఆయన ప్రశ్నించారు. ఈ మండలాలను ఓట్లు అడిగే హక్కు రాజకీయ పార్టీలకు , అభ్యర్థులకు లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే ఏజెన్సీ డీ.ఎస్. ని కోడ్ కు ముందు ఎందుకు నిర్వహించలేదని ఆయన అన్నారు.ఈ సమావేశంలో జి .ఎస్పీ. నాయకులు చింత మోహన్, ప్రతాప్, చంటి, రాజేష్, రాజబాబు తదితరులు పాల్గొన్నారు.