సీఎం సీపీఆర్‌వో గా మాజీ జర్నలిస్టు బి.అయోధ్య రెడ్డి..! 

సీఎం సీపీఆర్‌వో గా మాజీ జర్నలిస్టు బి.అయోధ్య రెడ్డి..! 

డెస్క్ :  ముఖ్యమంత్రి ముఖ్య ప్రజా సంబంధాల అధికారి (సీపీఆర్‌వో)గా మాజీ జర్నలిస్టు బి.అయోధ్య రెడ్డి నియమితులు కానున్నట్లు సమాచారం.. ఈయన పలు మీడియా సంస్థల్లో పనిచేసి కాంగ్రెస్‌లో చేరారు. మరోవైపు ముఖ్యమంత్రి ముఖ్య భద్రతాధికారి (సీఎస్‌వో) గా గుమ్మి చక్రవర్తిని నియమిస్తూ డీజీపీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన ప్రస్తుతం నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో ఎస్పీగా ఉన్నారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి తన కార్యాల యంలో పనిచేసే బృందాన్ని తన అనుచర వర్గం, అనుయాయు లతో సిద్ధం చేసు కుంటున్నారు. అత్యంత కీలకమైన ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంవో) టీమ్‌లో ఎవరెవరు ఉండాలో ఖరారు చేసినట్లు తెలు స్తోంది.పనితీరు, సామాజిక న్యాయం ఆధారంగా వీరిని ఎంపిక చేసినట్లు సమాచారం. దీనిపై మంగళవారం ఉత్తర్వులు వెలువ డనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment