సమయపాలన పాటించని వార్డెన్ లపై చర్యలు తీసుకోవాలి
– ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు జాగటి రవితేజ
ములుగు ప్రతినిధి : సమయపాలన పాటించనీ వార్డెన్లపై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు జాగటి రవితేజ డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టల్లో వార్డెన్లు సమయపాలన లేకుండా ఇష్టం వచ్చినట్టు వస్తున్నారని అన్నారు. అదేవిధంగా రెగ్యులర్ గా రాని వార్డన్ల పై విచారణ జరిపి చర్యలు తీసుకో వాలన్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు మంచి నీటి సమస్య, బాత్రూంలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారన్నారు. ఉపాధ్యాయులు బోధన సరిగ్గా చెప్పక పోవడంతో పేద మధ్యతరగతి విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నార న్నారు. వెంటనే విద్యార్థుల సమస్యలు పరిష్క రించాలని వారు డిమాండ్ చేశారు. లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు మందపల్లి స్వామి, కోయిల బాలేశ్వర్, కావిరి బైరేష్, పుర్రి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.