శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
– శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా వెంకటాపురం మండలం అంకన్నగూడెం, రామచంద్రపురం గ్రామాల మధ్య ప్రధాన రహదారి పక్కనే వేంచేసి ఉన్న గుడి గుట్ట శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద శనివారం కార్తీక మాసం పంచమి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం శనివారం పంచమి మంచి రోజు కావడంతో వెంకటాపురం మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారి వేల్పూరి శ్రీనివాస రావు గుప్తా కుటుంభం ఆధ్వ ర్యంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, వేద పండితులతో స్వామి వారి కథలతో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు . శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తయిన తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. అనంతరం ఆలయం వద్ద భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గుడి గుట్ట శ్రీ అభయాంజ నేయ స్వామి వారి ఆలయం దశాబ్దాల కాలంగా భక్తుల పూజలు అందుకుంటు న్నారు. భక్తిరస కార్యక్రమాలతో పాటు స్వామివారి కృపకు భక్తులు పాత్రులు అవుతున్నారు. ఎంతో మహిమ గల గుడి గుట్ట శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద చుట్టుపక్కల గ్రామాలు కు చెందిన అనేకమంది శ్రీ ఆంజనేయ స్వామి మాల ధారణ అంజన్న స్వాములు, ఈ గుడి గుట్ట వద్దనే దీక్ష తో ఇక్కడే గుడి వద్దనే వంటలు చేసుకుని భక్తిశ్రద్ధలతో స్వామి వారి దీక్షాపరులు పూజలు నిర్వహిస్తుంటారు. ఎంతో మహిమ గల శ్రీ గుడిగుట్ట ఆంజనేయ స్వామి ఆలయం వద్ద కార్తీకమాసం ప్రారం భం నుండి, శ్రీ అంజన్న స్వాముల భజన కార్యక్రమాలు, పూజలతో ప్రధాన రహదారి పక్కనే వెలిసిన స్వామి వారి ఆలయం, పక్కనే గుట్ట లు అడవి ఉండటంతో ఈ ప్రాంతంలో, స్వామివారి మహిమ లతో కోరిన కోరికలు తీర్చే ఆంజనేయ స్వామి గా ఈ ప్రాంత భక్తుల పూజలు అందుకుంటున్నారు.