విస్తృతంగా వాహనాల తనిఖీలు. 

విస్తృతంగా వాహనాల తనిఖీలు.

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని వాజేడు మండలం జగన్నాధపురం వై జంక్షన్ జాతీయ రహదారిపై గురువారం వాజేడు పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీల కార్యక్రమాన్ని నిర్వహించారు. వాజేడు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో వచ్చే పోయే వాహనాలను తనిఖీలు నిర్వహించి, అపరిచిత వ్యక్తుల సమాచారం తో పాటు ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఎలక్షన్ కోడ్ ప్రకారం తనిఖీల ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాజేడు సివిల్ పోలీస్ తో పాటు సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment