విస్తృతంగా ఎలక్షన్ డ్యూటీ ప్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు.
- వెంకటాపురం, వాజేడు మండలాల్లో అక్రమ మద్యం స్వాధీనం.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : భద్రాచలం నియోజకవర్గం ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుండి జిల్లా ఎన్నికల అధికారి ఆదేశంపై, వెంకటాపురం, వాజేడు మండలాలలో ఎలక్షన్ డ్యూటీ ప్లేయింగ్ స్కాడ్ విస్తృతంగా వాహనాలు తనిఖీల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్నికల నియమ నిబంధనలను ఉల్లంఘించే వారిపై అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు. అక్రమ మద్యం మరియు ఆధారాలు లేని నగదు తరలింపు ఇతర సామాగ్రి తదితర అంశాలపై వాహనాలలో తణికీలు నిర్వహిస్తున్నారు. వాజేడు మండలం చెరుకూరు గ్రామంలో బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించి అక్రమ మద్యం సాధించేసుకున్నారు. అలాగే వెంకటాపురం మండల కేంద్రంలో కూడ క స్కాడ్ అదికారులు అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకొని ఎలక్షన్ కోడ్ నియమ నిబంధన ప్రకారం కేసులు నమోదు చేసీనట్లు తెలిపారు. ఈ మేరకు వెంకటాపురం వాజేడు మండలాల్లో ఎలక్షన్ డ్యూటీ ప్లేయింగ్ స్కాడ్ అధికారి చంద్రశేఖర్, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సమాలాల్,రెవిన్యూ శాఖ జూనియర్ అసిస్టెంటు కంటెం బలరాం , కానిస్టేబుల్ తో పాటు వీడియో గ్రాఫర్, విధులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు వెంకటాపురం వాజేడు మండలాల్లో ప్రధాన రహదారులతో పాటు, సమాచారం మేరకు ఇతర ప్రాంతాల్లో కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘన అక్రమ మద్యం, ఆధారాలు లేని నగదు, ఇతర సామాగ్రి వంటి అంశాలపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే సంచార టీమ్ ప్రయాణించే వాహనంపై కూడా సీ.సీ. కెమెరాలు తో పాటు జిపిఎస్ ట్రాకింగ్ సిస్టంతో అనుసంధానం చేసి, అవసరమైతే ఆయా ప్రాంతాలలొ అదనపు సిబ్బంది, బలగాలను రప్పించుకునేందుకు ఎప్పటికప్పుడు, నెట్వర్క్ తో సంచార టీమ్ విధులు నిర్వహిస్తున్నది .ఇందులో భాగంగా బుధవారం వెంకటాపురం వాజీడు రహదారిలో ప్రచార వాహనాలతో పాటు వచ్చే పోయే వాహనాలు ను కూడా ఎన్నికల డ్యూటీ టీమ్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేసి తనిఖీల కార్యక్రమాన్ని వీడియో లో ఎప్పటికప్పుడు చిత్రీకరిస్తున్నారు. రాజకీయ పార్టీల సభలు సమావేశాలకు కూడా ఎన్నికల సంచార నిఘా టీమ్ లు సమాచారాన్ని రాబడుతున్నట్లు అధికారులు తెలిపారు.జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారుల ఆదేశాలకు అనుగుణంగా విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
1 thought on “విస్తృతంగా ఎలక్షన్ డ్యూటీ ప్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు. ”