విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

తెలంగాణ జ్యోతి, నవంబర్ 18, ములుగు ప్రతినిధి : విద్యుత్ షాక్ తో పోరిక సురేష్(22) అనే యువకుడు మృతిచెందిన సంఘటన ములుగు మండలం పత్తిపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పోరిక రజిత ఉదయం 6గంటలకు బట్టలు ఇంటి వద్ద ఉన్న జే వైర్ పై ఎండేస్తున్న క్రమంలో ఇంట్లోకి విద్యుత్ సరఫరా నిమిత్తం ఉన్న విద్యుత్ వైరు ఫేయిల్ అయ్యి జే వైరుకు తగిలి ఉండటంతో ఒక్క సారిగా విద్యుత్ షాక్ కు రజిత గురై కేకలు వేసిందని తెలిపారు. ఇంట్లో పడుకొని ఉన్న పోరిక సురేష్(22) హుటాహుటిన తల్లి వద్దకు చేరుకొని ఆమెను కాపాడేందుకు పట్టుకొని లాగాడని అన్నారు. సురేష్ కు సైతం విద్యుత్ షాక్ కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడని తెలిపారు. సురేష్ ను చికిత్స నిమిత్తం ములుగు ప్రభుత్వ దావాఖానకు తరలిస్తున్న క్రమంలో మార్గ మధ్యలో మృతి చెందాడని గ్రామస్తులు వివరించారు. మృతుడు ఒరిస్సాలోని లా యూనివర్సిటీలో లా చదువుతున్నా డు. దీపావళి కి ఇంటికి వచ్చిన క్రమంలో ఈ ఘటన జరిగింది.కాగా, ఈ ప్రమాదంలో తల్లి రజిత స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయట పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దావాఖానకు తరలించారు. తనను కాపాడే ప్రయత్నంలో కళ్ళ ముందే కుమారుడు చనిపోవడంపై రజిత చేసిన రోధనలు మిన్నంటాయి.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment