రోడ్డు దాటుతుండగా డీసీఎం తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలు.
వెంకటాపూర్, డిసెంబర్ 1, తెలంగాణ జ్యోతి : రోడ్డు దాటు తుండగా వ్యక్తికి వాహనం( డీసీఎం) తగిలి తీవ్ర గాయాలైన సంఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం జవహర్ నగర్ గ్రామానికి చెందిన గుర్రం సంజీవ్(50) శుక్రవారం సాయంత్రం బర్రెలను ఇంటికి కొట్టుకు రావడం కోసమని రోడ్డు దాటుతుండగా నేషనల్ హైవే పై ఫాస్ట్ గా హనుమకొండ నుండి పసర వైపు వెళుతున్న డీసీఎం తగిలింది. క్రింద పడిన సంజీవ్ ను తప్పించబోయే క్రమంలో కంట్రోల్ కాకపోవడంతో కాలు మీద నుండి వెళ్ళింది. కాలుతోపాటు భుజం, తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆంబులెన్స్ లో ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారని గ్రామస్తులు తెలిపారు.