రేగులగూడెంలో ఇంటింటికి కాంగ్రెస్ ప్రచారం
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంథని శాసనసభ నియోజకవర్గం పరిధిలోని కాటారం మండలం రేగులగూడెంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటారం మండల పరిషత్ అధ్యక్షులు పంతకాని సమ్మయ్య మాట్లాడుతూ గడపగడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుద్దిల్ల శ్రీధర్ బాబు గెలుపునకు ప్రజలను చైతన్యవంతులు చేస్తూ ఆరు గ్యారెంటీ పథకాల కార్డులతో విస్తృత ప్రచారం చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షులు కుంభం రమేష్ రెడ్డి, దేవరాం పల్లి మాజీ సర్పంచ్ నవీన్ రావు, బండి రమేష్, డిసిసి మహిళా కార్యదర్శి డాక్టర్ ఏలుబాక సుజాత, బండారి శ్రీధర్, దేవేందర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
1 thought on “రేగులగూడెంలో ఇంటింటికి కాంగ్రెస్ ప్రచారం”