రామప్ప చెరువు మాజీ చైర్మన్ కలాలీ అనిల్ బిఆర్ఎస్ లోచేరిక.
తెలంగాణ జ్యోతి,నవంబర్ 21, ములుగు ప్రతినిధి : ములుగు మండలం జీవంత రావు పల్లి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు,రామప్ప చెరువు మాజీ చైర్మన్ కలాలీ అనిల్ ఎమ్మెల్సీ, ములుగు నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించా రు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అజ్మీర దరమ్ సింగ్, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ములుగు మండలం కన్నాయిగూడెం గ్రామానికి చెందిన 30 బంజార కుటుంబస్థులు బీఆర్ఎస్ పార్టీ లో చేరగా పార్టీలోకి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానించారు. తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. బంజార సామాజిక వర్గ అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తున్నారని, అంతే కాకుండా చిరకాల వాంఛ అయినటువంటి పోడు పట్టాల సమస్యను పరిష్క రించారన్నారు. మునుముందు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు అందుకోబోతున్నామాన్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవ్వడం ఖాయమని, అర్హులైన ప్రతీ ఒక్కరికీ అన్ని సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని మీరంతా బడే నాగజ్యోతిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.