రహదారికి ఇరువైపులా మెటల్ గుట్టలు : ఎదురెదురుగా ఢీ కొంటున్న వాహనాలు.
– తరుచుగా ప్రమాదాలు : గాయాలు పాలవుతున్న ప్రజలు.
– ఆర్ అండ్ బి కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో డేంజర్ బెల్స్.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : మండలం లోని వీరభద్రారం వద్ద కుక్కతోగు వాగు వద్ద వెంకటాపురం – చర్ల రాష్ట్రీయ రహదారికి ఇరువైపులా కాంట్రాక్టర్ గుట్టల మాదిరిగా మెటల్ ను గుట్టలుగా నిల్వ చేశారు. నిత్యం రద్దీగా వుండే ఈ రహదారి కి ఎదురుగా వస్తున్న వాహనాలు దగ్గరగా వచ్చే వరకు కనపడక పోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అసలే ప్రమాదకరమైన మలుపు, దానికి తోడు డౌన్ రోడ్డు కావడంతో ఎదురుగా వచ్చే వాహనాలు మెటల్ గుట్టల కారణంగా దగ్గరగా వచ్చేవరకు కనబడటంలేదు. దింతో పాటు, మెటల్ రాళ్లు రోడ్ పై దొర్లి టైర్ల కింద పడి జారీ క్రింద పడి పలువురు గాయాలపాలు అవుతున్నారు. కాంట్రాక్టర్ కుక్కతోగు వాగు వద్ద బీటి రోడ్డు రిపేర్ నిమిత్తం వందల లారీల మెటల్ మరియు చిప్స్ డంపింగ్ చేసి, ఇక్కడ నుండే హాట్ మిక్సి విధానంతో మరమ్మతు పనులకు గత కొన్ని నెలలుగా మేటల్ను వాడు తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై మెటల్ గుట్టలు కారణంగా అనేక మంది ప్రమాదాలకు గురవుతు న్నారు. రోడ్లపై డేంజర్ బెల్ తో వాహనదారులకు యమపాషాలుగా ప్రధాన రహదారికి ఇరువైపుల కంకర కుప్పలతో , కాసుల కక్కుర్తి తో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధి త కాంట్రాక్టర్ నిబంధనలకు విరుద్ధంగా కంకర కుప్పలు పోయడమే కాకుండా ఎవరికి చెప్తారో చెప్పుకోండి అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నారని ప్రజలు ఆమెను వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యా నికి వాహనదారులు ప్రమాదాలకు గురికావాల్సి వస్తుందని, ఇలాం టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కుక్కతోగు వాగు వద్ద ప్రమాదకరంగా రహదారికి ఇరువైపులా ఉన్న మెటల్ గుట్టలను తొలగించి, ప్రమా దాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్, ములుగు జిల్లా పోలీస్ ఎస్.పి, రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధి కారులకు ప్రజలు పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నారు .
1 thought on “రహదారికి ఇరువైపులా మెటల్ గుట్టలు : ఎదురెదురుగా ఢీ కొంటున్న వాహనాలు. ”