ములుగు జిల్లాకు సీఎం కేసీఆర్ రాక
తెలంగాణ జ్యోతి, నవంబర్ 23, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడి స్టేడియంలో అభ్యర్థి నాగజ్యోతి గెలుపు కోరుతూ బిఆర్ఎస్ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభకు శుక్రవారం సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. సీఎం కేసీఆర్ రాక సందర్భంగా గురువారం సభ ప్రాంగణాన్ని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణరావు, గ్రంథాలయ చైర్మన్ గోవిందు నాయక్ లు పరిశీ లించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు లక్ష మంది ప్రజలు, కార్యకర్తలు సభకు హాజరుకానున్నారని, ఈ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా బారికెట్లు, సభాస్థలిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరు కాను న్నారన్నారని పేర్కొన్నారు. ఈ సభకు నియోజకవర్గ వ్యాప్తంగా విచ్చేస్తున్న ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా, వాహనాలు, నీరు, సౌలభ్యాలను ముందే సమకూరుస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజలంతా ఈ సభాస్థలికి క్షేమంగా చేరుకునే విధంగా కార్యకర్తలు, ఇన్చార్జిలు వ్యవహరించాలన్నారు. సీఎం రాక సందర్భంగా పోలీసు బలగాలు విస్తృతంగా మోహరించాయి.