మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గా చీమల రాజు
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: మాజీ మంత్రి, ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కాటారం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా చీమల రాజు ను నియమిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ కాటారం మండల అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, శ్రీను బాబు లకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు చీమల రాజు కృతజ్ఞతలు తెలిపారు.