భాజపా, బారాసా లకు ఓటుతో బుద్ధి చెప్పండి.
– భారత్ బచావో నాయకులు డాక్టర్ ఎం.ఎఫ్ గోపీనాథ్.
తెలంగాణ జ్యోతి, నవంబర్ 22, ములుగు ప్రతినిధి :
భాజపా, బారాసా లకు ఓటుతో బుద్ధి బుద్ధి చెప్పాలని భారత్ బచావో తెలంగాణ రాష్ట్ర కమిటీ నాయకులు డాక్టర్ ఎం.ఎఫ్ గోపీనాథ్ అన్నారు. ములుగు పట్టణ కేంద్రంలోని విశ్రాంతి ఉద్యోగుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భాజపా, బారాసా లకు ఓటుతో బుద్ధి చెప్పి ఫాసిస్ట్, మతోన్మాద, బ్రాహ్మణీయ సామ్రాజ్యవాదులను కూకటి వేళ్లతో పెకిలించాలన్నారు. రెండు పార్టీలను అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో గద్దె దింపాలని ప్రజలు ఈ రెండు పార్టీలు మినహా మరే పార్టీ కైనా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ముందు వరసలో ఉండి రాష్ట్ర సాధనకు ఎంతోమంది విద్యార్థులు ,మేధావులు తమ అమూల్యమైన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తృణ ప్రాయంగా వదిలేసి రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేయగా నేడు తెలంగాణ రాష్ట్రం దొరల చేతిలో బందీ ఐ ఆనాటి బ్రిటిష్ పాలనను మరిపిస్తుందని దళిత ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ తానే ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని గతంలో తెలంగాణ కోసం కొట్లాడిన వారందరినీ ప్రక్కన పెట్టి రాష్ట్రంలో ఫాసిస్ట్ నిర్బంధాన్ని ప్రజలపై ప్రయోగిస్తూ తాను మాత్రం రాజబోగాలు అనుభవిస్తూ పాలన గాలికి వదిలేసి ఫామ్ హౌస్ , ప్రగతి భవన్ కు పరిమితమై దొరల పాలనను మరిపిస్తున్నాడని సామాజిక ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో . ప్రజలకు స్వేచ్ఛ స్వాతం త్ర్యాలు లేకుండా చేసి నియంత పాలన కొనసాగిస్తున్న ముఖ్య మంత్రి కేసీఆర్ అన్నారు. అటు దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధనికులకు ఆదాయాన్ని సమకూర్చి పేదవారిని మరింత పేదవారిగా మార్చే విధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు రూపొంది స్తూ ప్రజలను మభ్యపెడుతూ పాలన కొనసాగిస్తున్నాడు అన్నారు. నేడు ప్రజలు ప్రజల మేలుకోరే పార్టీని గెలిపించుటలో కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ నాయకులు, ఆదివాసి నాయకులు పాల్గొన్నారు.