భద్రాచలం కేటీఆర్ సభకు భారీగా తరలి వెళ్లిన నాయకులు

భద్రాచలం కేటీఆర్ సభకు భారీగా తరలి వెళ్లిన నాయకులు

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి:   నియోజకవర్గ కేంద్రమైన భద్రాచలంలో ఆదివారం మంత్రి కేటీఆర్ సభకు ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల నుండి వందలాది మంది కార్యకర్తలు,నాయకులు భద్రాచలం సభకు తరలి వెళ్లారు.భద్రాచలం నియోజకవర్గంలోని వాజేడు, వెంకటాపురం మండలాల నుండి పార్టీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మండల నాయకులు, కార్యకర్తలు అనేకమంది ఉదయం వాహనాలకు గులాబీ జెండాలను అలంకరించి, జై కేసీఆర్ జై జై కేసీఆర్ కారు గుర్తుకే మన ఓటు అంటూ నినాదాలు చేస్తూ వాహనాల శ్రేణి తో అట్టహాసంగా భద్రాచలం కేటీఆర్ సభకు తరలి వెళ్లారు. వాజేడు మండలం నుండి కేటీఆర్ బహిరంగ సభ వాహనాల శ్రేణికి మండల పార్టీ అధ్యక్షులు పి. కృష్ణారెడ్డి వెంకటాపురం, వాజేడు మండలాల ఎన్నికల ప్రచార కన్వీనర్ బోదెబోయిన బుచ్చయ్య లు జెండా ఊపి వాహనాల శ్రేణీ ని పార్టీ నినాదాలు తో ప్రారంభించారు. ఈ సందర్భంగా అనేకమంది కార్యకర్తలు,పార్టీ అనబంద సంఘాల నాయకులు , మహిళా కార్యకర్తలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు సభకు తరలివెళ్లి భద్రాచలం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించుకుంటామని నినాదాలు చేస్తూ, భద్రాచలం బహిరంగ సభలో వెంకటాపురం, వాజేడు మండలాల బిఆర్ఎస్ నేతల మార్క్ ను కేటీఆర్ కు తెలియజేసే విధంగా సభలో నినాదాలు చేశారు. వెంకటాపురం మండల పార్టీ అధ్యక్షులు గంపా రాంబాబు, ప్రచార ఇంచార్జి జి. నరసింహమూర్తి ,చింతల శ్రీనివాస్,ఎండి ముస్తఫా ఇంకా పలువురు నాయకులు, కార్యకర్తలు వాహనాల శ్రేణితో కార్యకర్తలతో భారీ సంఖ్యలో భద్రాచలం తరలి వెళ్ళారు. మా రెండు మండలాలు టిఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్నాయని, ప్రజల ఆదరణతో భద్రాచలం అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావు కు భారీ మెజార్టీ తీసుకువస్తామని, ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. భద్రాది రాముని ఆశీర్వాదంతో ఈసారి డాక్టర్ తెల్లం వెంకటరావు ఘనవిజయం సాధిస్తారని, ప్రతి కార్యకర్త అంకితభావంతో ప్రచార కార్యక్రమంలో సైనికులుగా కథనరంగంలో దూకుతున్నామని మెజార్టీ సాధిస్తామని ఈ సందర్భంగా నాయకులు భద్రాచలం నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి శాసన మండలి సభ్యులు తాతామదుకు హామీ ఇచ్చారు. వెంకటాపురం, వాజేడు మండలాల బిఆర్ఎస్ నాయకుల ఉత్సాహాన్ని గమనించిన మంత్రి కేటీఆర్ వారికి స్వాగతం పలుకుతూ, కష్టపడి పనిచేసి భద్రాచలం నియోజకవర్గంలో డాక్టర్ తెల్లం వెంకటరావు ను గెలిపించుకొని భద్రాద్రి రామునికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కి కానుక గా సమర్పిద్దామని, భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి తమ జ్యేయమని ఈ సందర్భంగా కార్యకర్తలకు నాయకులకు హర్షధ్వనా ల మధ్య మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment