బీఆర్ఎస్ పార్టీని ఆదరించిన వారికి కృతజ్ఞతలు
ములుగు ప్రతినిధి , డిసెంబర్ 3, తెలంగాణ జ్యోతి : ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన ప్రజలందరికి నా పాదాభివందనాలు, నా పై నమ్మకంతో బి ఫారం ఇచ్చిన కెసిఆర్, కేటీ ఆర్ లకు ములుగు అభ్యర్థి బడే నాగజ్యోతి కృతజ్ఞతలు తెలిపారు. నాకు టికెట్ ఇచ్చిన నాటి నుండి పోలింగ్ వరకు నా కోసం రాత్రి పగలు కష్టపడ్డ ప్రతి యొక్కరికి నా పాదాభి వందనాలన్నారు. ముఖ్యంగా నాకు అండగా ఉన్న పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, సతీష్ రెడ్డి, కాకులమర్రి లక్ష్మణ రావుకు, ఇంచార్జ్ సాంబారి సమ్మారావు, మెట్టు శ్రీనివాస్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, సర్పంచ్లు, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక కృతజ్ఞతలని పేర్కొన్నారు. ములుగులో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి ధనసరి అనసూయకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.