బిఆర్ఎస్ నుండి బీజేపీలోకి చేరికలు
తెలంగాణ జ్యోతి, నవంబర్ 16, ములుగు ప్రతినిధి : ములుగు మండలం బండారుపల్లి గ్రామం నుండి బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు స్వచ్ఛందంగా బిజెపిలో చేరగా ఎమ్మెల్యే అభ్యర్థి అజ్మీర ప్రహ్లాద్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో కిరణ్, శ్రీకాంత్, తిరుపతి, ఈర్ల రవి, కె చేరాలు, అల్లం విజయ్, దోమటి ఓంకార్, బూసికొండ మొగిలి, దేవి భరత్, సాధు బాబురావు, మహేందర్, సాదు వెంకటేష్, రమేష్, నరేందర్, నవీన్, రాజు, నవీన్ లతో పాటు 50 మంది చేరారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు కేశెట్టి కుటుంబరావు, కళాలి అనిల్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.