బడే నాగజ్యోతి గెలుపు కోసం బొడ్రాయి వద్ద పూజలు
ఏటూరునాగారం ప్రతినిధి : ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని చిన్న బోయినపల్లి గ్రామంలో బిఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి గెలుపు కోసం గ్రామ ప్రజలు బొడ్రాయి వద్ద పూజలు చేశారు. అధిక మెజారిటీతో గెలవాలని కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క చేసింది ఏమీ లేదన్నారు. గత ఎన్నికలలో సీతక్క మెజార్టీ గెలుపుకు బీసీల ఎస్సీల ఓట్లు కీలకంగా ఉన్నాయన్నారు. కానీ ఈ ఐదు సంవత్సరాలలో బీసీలకు, ఎస్సీలకు చేసిందేమీ లేదంటూ వాపోయారు. ఈ కార్యక్రమంలో ఆడేపు వెంకటేష్, చిట్టి పోతుల చంద్రమౌళి, హమీద్, రడం గోపి, అహ్మద్ పాషా, నల్ల బోయిన నాగార్జున, ఎట్టి ధనలక్ష్మి, ముద్ద బోయిన పార్వతి, చిక్క వెంకన్న, రేగ జంపయ్య, ఎట్టి సాయి, లక్కర్ సునీల్, గంజి రవి, సంఘం రాకేష్, చాడ మల్లారెడ్డి, తుమ్మ నరసింహారెడ్డి, గ్రామ అధ్యక్షులు గుజ్జేటి రాజశేఖర్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.