ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బ్రాందీ షాపులు
– గ్రామం మధ్యలోనే ఏర్పాటు చేస్తున్న బ్రాందీ షాపు
– గ్రామస్తుల ఆందోళనలతో ఆగిన ప్రారంభం
– బ్రాందీ షాపు యజమానులకు కొమ్ము కాస్తున్న ఎక్సైజ్ అధికారులు
వెంకటాపూర్, డిసెంబర్ 01, తెలంగాణ జ్యోతి : తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా బ్రాందీ షాపులను డిసెంబర్ 1 నుంచి ప్రారంభిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తుందో ఎవరికి తెలవదు. అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు తెలంగాణ రాష్ట్రంలో బ్రాందీ షాపుల ప్రక్రియ మొదలైంది. అక్టోబర్ 13న ఎలక్షన్ కోడ్ రావడంతో పాత బ్రాందీ షాపు యజమానులు నవంబర్ 30 వరకు షాపులను మూసివేశారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. అయినప్పటికీ డిసెంబర్ ఒకటో తేదీన నూతన బ్రాందీ షాపులను ప్రారంభించాల్సి ఉండగా అధికారుల, ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్రాందీ షాపులను ప్రారంభిస్తున్నారు. ఇదిలా ఉండగా కొంతమంది బ్రాందీ షాపు యజమానులు నిబంధనలకు విరుద్ధంగా గ్రామం మధ్యలోనే బ్రాందీ షాపులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలవ డంతో గ్రామస్తులు గొడవకు దిగారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవి పేట గ్రామంలో గ్రామ మధ్యలోనే ఏర్పాటుకు ప్రారంభం చేస్తున్న సమయంలో గ్రామస్తులు గొడవకు దిగారు. కుటుంబాలు,మహిళలు, పిల్లలు నివాసం ఉండే చోట మధ్య బ్రాందీ షాపు ఉండకూడదని ఈ బ్రాందీ షాపు వల్ల మా కుటుంబాలకు ఇబ్బంది కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనకు విరుద్ధంగా బ్రాందీ షాపులను ఏర్పాటు చేయొద్దని గ్రామస్తులు ఆందోళనకు చేపట్టారు. గొడవ జరిగే సమయంలో ఎక్సైజ్ అధికా రులు సంఘటన స్థలానికి చేరుకొని బ్రాందీ షాపు యజమానికి వత్తాసు పలుకుతున్నారని ప్రజలు తెలిపారు. బ్రాందీ షాపు యజమానికి ములుగు ఎక్సైజ్ అధికారులు కొమ్ము కాస్తున్నట్లు ప్రజలు తెలిపారు. ఏది ఏమైనా గ్రామం మధ్యలో బ్రాందీ షాపును ప్రారంభించవద్దని ప్రజలు షాపు నిర్వాహకులను,ఎక్సైజ్ శాఖ అదికారులను హెచ్చరించారు.
1 thought on “ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బ్రాందీ షాపులు”