ప్రజా సమస్యలపై నిరంతరం శ్రమించే వ్యక్తులే జర్నలిస్టులు
– అలాంటి వ్యక్తుల పట్ల నిర్లక్ష్యం వహించడం సరైంది కాదు
– జర్నలిస్టులు వేసుకున్న ఇళ్లకు వెంటనే పట్టాలి ఇవ్వాలి
– టి డబ్ల్యూ జె ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు పిట్టల మధుసూదన్
తెలంగాణ జ్యోతి, నవంబర్ 25, వెంకటాపూర్ : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరంతరం శ్రమించే వ్యక్తులే మా జర్నలిస్టు లని టీ డబ్ల్యూ జె ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు పిట్టల మధుసూదన్ అన్నారు. వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని సర్వే నెంబర్ 14 లోని ప్రభుత్వ భూమిలో వెంకటాపూర్ జర్నలిస్టులు రేకుల షెడ్లు వేసుకుని గత కొద్ది రోజులు గా శాంతియుత దీక్ష చేపడుతున్న విషయం తెలిసిందే. కాగా, శని వారం పిట్టల మధుసూదన్ పాలంపేట గ్రామానికి చేరుకొని వెంకటా పూర్ జర్నలిస్టులకు మద్దతు ప్రకటించారు .ఈ సందర్భంగా పిట్టల మధుసూదన్ మాట్లాడారు.. గత కొన్నేళ్లుగా జర్నలిస్టులు ఇంటి స్థలాల కోసం మరియు ఇండ్ల నిర్మాణం కోసం అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నప్పటికీ పట్టించు కోకపోవడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వానికి ప్రజల కు మధ్య వారధిగా ఉంటూ గ్రామ స్థాయిలో ప్రజా సమస్యల ను ఎప్పటిక ప్పుడు వెలుగులో కి తీసుకువచ్చే జర్నలిస్టులను చిన్నచూపు చూడడం సరైనది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు మంజూరు చేయాలని పలుమార్లు మొరపెట్టు కున్నప్పటికీ ఎవరు పట్టించుకోకపోవడంతోనే వెంకటా పూర్ జర్నలిస్టులు పాలంపేటలో గుడిసెలు వేసుకోవాల్సి వచ్చిం దని తెలిపారు.పాలంపేట్ లోని ప్రభుత్వ భూమిలో జర్నలిస్టులు గుడిసెలు వేసుకొని వారం రోజులు కావస్తున్నా ఇప్పటికి అధికా రులు వారి వద్దకు వెళ్లి ఎలాంటి హామీ ఇవ్వకపోవ డం బాధాకర మని అన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి జర్నలి స్టులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్ర మంలో జర్నలిస్టులు బేతి సతీష్ , ఒద్దుల మురళి, రాంగీశెట్టి రాజేందర్, పిల్లలమర్రి శివ, దండేపల్లి సారంగం, మామిడ్ల సంపత్, తీగల యుగేందర్,మునిగల రాజు, మామిడిశెట్టి కోటి, అలుగొండ రమేష్, ఎం డి రఫీ, ఎనగందుల శంకర్, గట్టు ప్రశాంత్, దేశిని మహేందర్, బాణోత్ యోగి, వినీల్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.