పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ప్రారంభించిన ఎస్పీ గౌస్ ఆలం
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : వెంకటా పురం మండల పరిధిలోని వర్తకులు, వ్యాపారస్తులు, నేతల సహకా రంతో వెంకటాపురం మండలకేంద్రం, ఆలుబాక లో నేరాలను నిరో దించటానికి, పరిసరాల పై నిఘా కోసం ఏర్పాటుచేసిన సీసీ కెమె రాలను జిల్లా ఎస్.పి గౌస్ ఆలం, ఓ.ఎస్.డి అశోక్ కుమార్, ఎ.ఎస్.పి ఏటూరునాగారం సిరిశెట్టి సంకీర్త్ లు ప్రారంబించారు. వెంకటాపురం, ఆలుబాక ల వర్తకులు, వ్యాపారస్తులు, ముఖ్యమైన నేతల సహకారంతో 13 లక్షల విలువగల 70సి.సి కెమెరాలు, 4 ఎన్.పి.ఆర్ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు ఏర్పా టు చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వెంకటాపురం పోలీస్ శాఖ వారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఆలుబాక సిఆర్పిఎఫ్ క్యాంపు నందు నూతనంగా నిర్మించిన గెస్ట్ హౌస్ ను ములుగు జిల్లా ఎస్.పి గౌస్ ఆలం , ఓ.ఎస్.డి అశోక్ కుమార్, ఎ.ఎస్.పి ఏటూరునాగారం శిరిశెట్టి సంకీర్త్ ఐ.పి.ఎస్ లు ప్రాంబించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిఐ బి.కుమార్, ఎస్సై వెంకటాపురం ఆర్. అశోక్, ఎస్ఐ కే. తిరుపతి రావు, వాజేడు ఎస్సై వెంకటేశ్వర్ రావు, వెంకటాపురం పోలీస్ స్టేషన్ సిబ్బంది హాజరైనారు.