పిడుగుపాటుతో తృటిలో తప్పిన ప్రాణాపాయం.
- ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం లో సోమవారం మధ్యాహ్నం పిడుగుపాటు కు గురై ముగ్గురు వ్యక్తులు ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్నికల డ్యూటీ నిమిత్తం వెళ్తున్న వెంకటాపురం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మల్లయ్య, సీతారాంపురం గ్రామానికి చెందిన రాంబాబు, సుమన్, తదితరులు మండలంలోని ముర్రవానిగూడెం గ్రామం వద్ద ఈదురుగాలతో వర్షం పడుతుండగా ప్రధాన రహదారి పక్కనే ఉన్న చెట్టు కింద వీరు ముగ్గురు నిలబడ్డారు. వేగంతో వీస్తున్న గాలులతో పాటు మెరుపులతో చెట్టు పక్కనే పిడుగు పడింది. ఆకస్మిక పిడుగుపాటుకు ముగ్గురు షాక్ తో స్రుహ కోల్పోయారు. వెంటనే వారిని అంబులెన్స్ ద్వారా వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స కోసం తరలించారు. తృటిలో ప్రాణాపాయం నుండి బయటపడ్డ ముగ్గురిని పలువురు పరామర్శించి ధైర్యం చెప్పారు. మండలంలో అనేక ప్రాంతాల్లో గాలి వర్షంతో పిడుగులు పడినట్లు సమాచారం.
1 thought on “పిడుగుపాటుతో తృటిలో తప్పిన ప్రాణాపాయం.”