పరమేశ్వర బ్రిక్స్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు అన్నదానం
తెలంగాణ జ్యోతి, నవంబర్ 18, వెంకటాపూర్: మండలంలోని పాలంపేట గ్రామంలో జర్నలిస్టు కాలనీ ఏర్పాటు చేసుకున్న జర్నలిస్టులకు శనివారం పరమేశ్వర బ్రిక్స్ యాజమాన్యం రామిడి శ్రీరామ్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీరామ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పని చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం పనిచేసే జర్నలిస్టుల సేవలను ప్రభుత్వాలు గుర్తించాలన్నారు. ప్రతి ఒక్కరూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించడం కోసం తమ వంతు సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు భేతి సతీష్, ఎనగందుల శంకర్, ఎండి రఫీ, బీరెల్లి రమేష్, బానోతు యోగి నాయక్, దండేపల్లి సారంగం గౌడ్, పోశాల చంద్రమౌళి గౌడ్, పిల్లలమర్రి శివరాం, ఎనబోతుల కృష్ణ, మునిగాల రాజు గౌడ్, గట్టు ప్రశాంత్, మామిళ్ళ సంపత్, కందికొండ అశోక్, మామిడిశెట్టి ధర్మతేజ, ఆకుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.