నూగూరు గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురు పంచాయతీ కేంద్రంలో సోమవారం ఉదయం వెంకటాపురం పోలీసులు కమ్యూ నిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. వెంకటాపురం సివిల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రేఖ అశోక్ గ్రామస్తులతో మాట్లాడు తూ, అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించవద్దని, అసాంఘిక శక్తుల పట్ల అప్రమ త్తంగా ఉండాలని, కోరారు. గ్రామీణ యువత ఉద్యోగ, ఉపాధి, విద్యా రంగాలలో ముందుకు సాగాలని, ప్రభుత్వ సంక్షేమ పథకా లు, గిరిజన సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా గ్రామస్తులకు ఎస్.ఐ. అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సివిల్ పోలీసులతో పాటు సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం లో పాల్గొన్నారు.
1 thought on “నూగూరు గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం.”