నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోండి.
ఏటూరు నాగారం ప్రతినిధి : ఈనెల 30న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును భయాందోళనకు గురికాకుండా నిర్భయంగా ఓటు హక్కు వినియో గించుకోవాలని ఏటూరునాగారం ఏఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామంలో సీఐ మండల రాజు, ఎస్సై కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ జరుగనున్న ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. దీనిలో భాగంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి గట్టి నిఘా ఏర్పాటు చేశామని అన్నారు.
1 thought on “నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోండి. ”