నా బలం నా బలగం ములుగు ప్రజలు : నాగజ్యోతి
తెలంగాణ జ్యోతి, నవంబర్ 24, ములుగు ప్రతినిధి : నా బలం నా బలగం ములుగు ప్రజలేనని ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. శుక్రవారం ములుగులో జరిగినటువంటి ప్రజా ఆశీర్వాద సభకు విచ్చేసి నన్ను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి కేసిఆర్ కి, నాకుటుంబ సభ్యులు, నా బలమైన ములుగు ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కేసిఆర్ రాక కోసం ఎదురు చూసి, మీ బిడ్డనైన నన్ను దీవించండి అని వేడుకుంటే దీవించి వెళ్లిన, సభ విజయవంతం కావడానికి కష్టపడిన ప్రతి నా గులాబీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.