టీఎస్ గౌడ సంఘ మండల అధ్యక్షుడిగా గట్టు శంకర్
వెంకటాపూర్ ప్రతినిధి : తెలంగాణ గౌడ సంఘం వెంకటాపూర్ మండల అధ్యక్షునిగా గట్టు శంకర్ ను నియమిస్తూూ గురువారం తెలంగాణ ములుగు జిల్లా అధ్యక్షుడు ముసీనిపల్లి మొండయ్య గౌడ్ నియామక పత్రాన్నిి అందజేశారు. ఈ సందర్భంగా గట్టు శంకర్ మాట్లాడుతూ గీత కార్మికులకు కృషి చేస్తానని నా పదవికి సహకరించిన గౌడ సంఘం నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గట్టు కుమారస్వామి, సంఘ నాయకులు చిర్ర తుఫాన్ ,చిర్రా శివకృష్ణ , వీరగాని రమేష్, దుమ్మటి రాజయ్య ,కాసాగాని ఓదెలు ,గట్టు సాంబయ్య,కారు పోతుల రాజు ,జనగాం రవీందర్ తదితరులు ఉన్నారు.