జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో చేరికలు
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం,నవంబర్ 23 : ఏటూరునాగారం మండల కేంద్రంలో కాంగ్రెస్ మాజీ వార్డ్ మెంబర్ వావిలాల ఎర్ర ముత్త య్యతో పాటు సుమారు 50 మంది బిఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఆధ్వర్యంలో బి ఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు.బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికీ జిల్లా అధ్యక్షులు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్య క్రమంలో మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి ఖాజాపాష, ఎండి వలి బాబా,శివాలయం చైర్మన్ తాడూరి రఘు,రైతు కోఆర్డినేటర్ దనపునేని కిరణ్,సప్పిడి రామ్ నర్సయ్య, శ్రీనివాస్,రామకృష్ణ,లాలు,పాల్గొన్నారు.