జర్నలిస్టులను పట్టించుకోకపోవడం బాధాకరం
– వారికి ఇంటి స్థలాల పట్టాలు మంజూరు చేయాలి
– బీఎస్పీ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి జంపన్న
తెలంగాణ జ్యోతి నవంబర్ 20, వెంకటాపూర్ : ప్రజలకు ప్రభుత్వానికి సమన్వయకర్తగా పనిచేసే జర్నలిస్టులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని బీఎస్పీ ములుగు నియోజక వర్గ ఎం ఎల్ ఏ అభ్యర్థి జంపన్న అన్నారు. వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో గల సర్వేనెంబర్ 14లో ఉన్న ప్రభుత్వ భూమిలో జర్నలిస్టులు గుడిసెలు వేసుకొని శాంతియుత దీక్ష నిర్వహిస్తున్నారు కాదా సోమవారం డి.ఎస్.పి ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి భూక్య జంపన్న జర్నలిస్టుల కాలనీకి చేరుకొని జర్నలిస్టులకు మద్దతు తెలిపారు అనంతరం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శనిగరపు నరేష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు..ములుగు జిల్లా జర్నలిస్టులంతా గత 10 సం.రాలుగా ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ, అనేక సార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నారని అన్నారు. అనేక సార్లు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ లేదని, ఐ టి శాఖ మంత్రి కేటీఆర్ కి వినతి పత్రాలు ఇచ్చి వేడుకున్నారని పేర్కొన్నా రు. వినతి పత్రం ఇచ్చిన ప్రతిసారి నెరవేరుస్తామని చెప్పి ఇప్పటి వరకు నెరవేర్చలేదని ఆరోపించారు. గతంలో వెంకటా పూర్ మండల కేంద్రము లో 621 సర్వే నెంబర్ లో ఇండ్లు స్థలాల కోసం భూమి కేటాయించి, జర్నలిస్టు లకు మొండి చెయ్యి చూపించారని అన్నారు. కావున పాలం పేటలో సర్వే నెంబర్ 14 లో గల ప్రభుత్వ భూమిలో జర్నలిస్టులు గుడిసెలు వేసుకున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులు వేసుకున్న గుడిసెలు పట్టాలు పంపిణీ చేయాలని బీఎస్పీ ములుగు ములుగు నియోజక వర్గ ఎం ఎల్ ఏ అభ్యర్థి భూక్యా జంపన్న డిమాండు చేశారు. బహుజన రాజ్యం లో జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు కేటాయించి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఇంచార్జీలు విరబోయిన రాజేందర్ ముదిరాజ్ ,(రిటైర్డ్ ఆర్మీ) పసులాది ముకేష్ , జిల్లా ప్రధాన కార్యదర్శి కడపాక రాజశేఖర్ వర్మ, బీఎస్పీ నాయకులతోపాటు జర్నలిస్టులు బేతి సతీష్, రంగీశెట్టి రాజేంద్ర, ఒద్దుల మురళి, ధర్మ, సారంగం, శంకర్, రఫీ, చంద్రమౌళి, కృష్ణ, వినీల్, రామకృష్ణ, యోగి,రామ్, శివ తదితరులు పాల్గొన్నారు.