జర్నలిస్టులకు రామాంజాపూర్ సర్పంచ్ రాజిరెడ్డి అన్నదానం

జర్నలిస్టులకు రామాంజాపూర్ సర్పంచ్ రాజిరెడ్డి అన్నదానం

తెలంగాణ జ్యోతి  ,నవంబర్ 22, వెంకటాపూర్ : మండలంలోని జర్నలిస్టులకు రామాంజపూర్ సర్పంచ్ తుమ్మేటి రాజిరెడ్డి బుధవారం అన్నదానం ఏర్పాటు చేశారు. పాలంపేట గ్రామంలో జర్నలిస్టుల కాలనీ ఏర్పాటు చేసుకున్న సందర్భంగా వారికి మద్దతు ప్రకటించిన రాజిరెడ్డి అన్నదానం చేసిన అనంతరం మాట్లాడారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పని చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం పనిచేసే జర్నలిస్టుల సేవలను ప్రభుత్వా లు గుర్తించాలన్నారు. ప్రతి ఒక్కరూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించడం కోసం తమ వంతు సహకారం అందించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు న్యాయం జరిగేలా ఇళ్ల స్థలాలు ఇప్పించడంతోపాటు ఇల్లు నిర్మించి ఇప్పించేం దుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు లు బేతి సతీష్, ఒద్దుల మురళి, రంగిశెట్టి రాజేందర్, దండపెళ్లి సారంగం, బానోత్ యోగి, ఎలగందుల శంకర్, పిల్లలమర్రి శివరాం, విక్రమ్, ఆలుగొండ రమేష్, మామిడిశెట్టి ధర్మతేజ, మామిండ్ల సంపత్, ఎనబోతుల కృష్ణ, గునిగంటి హరీష్, ఎండి రఫీ, ఆకుల రామకృష్ణ, దేశిని వినిల్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment