జర్నలిస్టులకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలి : హమాలీలు

జర్నలిస్టులకు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలి : హమాలీలు

తెలంగాణ జ్యోతి, నవంబర్ 22, వెంకటాపూర్ : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతోపాటు పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలని పాలంపేట హమాలీలు అన్నారు. తమకు పక్క ఇండ్లు ఇవ్వాలని కోరుతూ ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జర్నలిస్టులు పాలంపేట్ గ్రామంలోని సర్వేనెంబర్ 14లోని ప్రభుత్వ భూమిలో రేకుల షెడ్లు వేసుకొని శాంతియుత దీక్ష నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న హమాలీలు బుధవారం పాలంపేటకు చేరుకొని జర్నలిస్టులకు సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జర్నలిస్టులు అదే ఉద్యమస్ఫూర్తితో ములుగు జిల్లా సాధన ఉద్యమంలో సైతం పాల్గొన్నారని అన్నారు. అలాంటి జర్నలిస్టులు నేడు ఇంటి స్థలాలతో పాటు ఇళ్ళ కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడడం బాధాకరమని అన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతోపాటు ఇండ్లు నిర్మించేంతవరకు వారికి హామాలి సంఘం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ములుగు జిల్లా కలెక్టర్ స్పందించి వెంకటాపూర్ జర్నలిస్టులకు ఇంటిస్థలాలు కేటాయించి వాటికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బొమ్మ రవి, మోత్కూరి బిక్షపతి, పోశాల రాజేందర్ , కాసరాజు సారయ్య, బండి రాజు, ఓదెల రాజేందర్ , దండేపల్లి రమేష్ , వడ్డేపల్లి వెంకన్న, చల్లగొండ సంపత్ లతోపాటు జర్నలిస్టులు బేతి సతీష్ , ఒద్దుల మురళి, మామిడిశెట్టి ధర్మ, దేశిని మహేందర్, దండేపల్లి సారంగం, ఆకుల రామకృష్ణ, గట్టు ప్రశాంత్, బిరెల్లి రమేష్,పిల్లలమర్రి శివరాం, రంగీశెట్టి రాజేందర్, యుగేందర్, మామిడ్ల సంపత్, పోశాల చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment