జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందే
– పలు పార్టీలు, ప్రజాసంఘాల మద్దతు
తెలంగాణ జ్యోతి, నవంబర్ 16, వెంకటాపూర్ : మండలంలోని పాలంపేట గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాల్సిందేనని పలు పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ భూమిలో జర్నలిస్టు జర్నలిస్టు కాలనీ ఏర్పాటు చేసుకున్న సందర్భంగా గురువారం జర్నలిస్టులకు మద్దతుగా ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్, ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ముంజాల బిక్షపతి గౌడ్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కెసిఆర్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు డబుల్ బెడ్ రూమ్ లో ఇవ్వాలని డిమాండ్ చేశారు .లేనిచో వారికి మద్దతుగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని బిక్షపతి గౌడ్ అన్నారు. అదేవిధంగా జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బైరెడ్డి భగవాన్ రెడ్డి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బండి శ్రీనివాస్ మాట్లాడారు. పదేళ్ల నుంచి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని మోసం చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు పంపిణీ చేయడంతో పాటు పక్కా ఇల్లు కట్టించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా రామప్ప పరిరక్షణ కమిటీ కన్వీనర్ అక్కిరెడ్డి రామ్మోహన్రావు కో కన్వీనర్ నల్లెల్ల రాజయ్యలు జర్నలిస్టులకు మద్దతు ప్రకటించారు. రామప్ప గుడి పరిరక్షణ కోసం యునెస్కో గుర్తింపు రావడానికి కోసం నిరంతరం తమ కళాలకు పని చెప్పిన జర్నలిస్టులకు కనీసం ఇంద స్థలాలు కూడా ఇవ్వకపోవడం సరికాదని వెంటనే వారికి ఇళ్ల స్థలాలను అందించాలని కోరారు. బిజెపి నాయకురాలు దివంగత నేత అజ్మీర చందులాల్ కూతురు పద్మక్క జర్నలిస్టులకు మద్దతు ప్రకటించారు అదేవిధంగా స్థానిక నాయకుడు చల్లగొండ రాజు , చింతం ప్రకాష్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు అన్నదానం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టు నాయకులు బేతి సతీష్ యాదవ్, దండ పెళ్లి సారంగం, పిల్లలమర్రి శివ, రంగి శెట్టి రాజేందర్, కేతిరి బిక్షపతి, తీగల యుగేందర్ , మునిగాల రాజు,రఫీ తదితరులు పాల్గొన్నారు.