జర్నలిస్టులకు అన్నదానం
తెలంగాణ జ్యోతి, నవంబర్ 16, వెంకటాపూర్ : మండలంలోని పాలంపేట గ్రామంలో జర్నలిస్టు కాలనీ ఏర్పాటు చేసుకున్న జర్నలిస్టులకు స్థానిక యువజన నాయకుడు చల్లగొండ రాజు ఆధ్వర్యంలో గురువారం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పని చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం పనిచేసే జర్నలిస్టుల సేవలను ప్రభుత్వాలు గుర్తించాలన్నారు. ప్రతి ఒక్కరు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించడం కోసం తమ వంతు సహకారం అందించాలన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు చింతం ప్రకాష్, వీర్ల జాంబి జర్నలిస్టులు ఉన్నారు.