ఘనంగా సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు శ్రీ మతి సోనియాగాంధీ పుట్టినరోజు వేడుక లను ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ అతిథి గృహం ఆవరణలో శనివారం ఘనంగా నిర్వహిం చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలకు హాజరై, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు పిఎసిఎస్ చైర్మన్ చిడెం మోహన్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు సయ్యద్ హుస్సేన్,వెంకటాపురం జడ్పిటిసి పాయం రమణ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలు, ఆశ యాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యాంటీల పథకం తో పాటు, సంక్షేమ పథకాలను ఆదరిస్తున్నారని అన్నారు. సోనీయా అమ్మ పుట్టినరోజు కానుకగా రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి రాష్ర్ట మహిళా సోదరీమణులందరికీ ఉచిత ఆర్.టి.సి బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించారన్నారు. ప్రభుత్వం కల్ఫించిన సౌక ర్యాన్ని సద్విని యోగం చేసుకోవాలని ఈ సంద ర్భంగా నాయకులు మహిళలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సోనియాగాంది జన్మ దినం సందర్భంగా కేకులు కట్ చేసి పరస్పరం మిఠాయిలు పంపిణీ చేసుకొని శుభాకాంక్షలు తెలుపు కున్నారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్ అంటూ కార్యకర్తలు నినాదాలతో అతిథి గృహం ప్రాంగణం మారు మ్రోగింది. నూతన ప్రభుత్వం ఏర్పడి రెండు రోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీ పథకాల్లో భాగంగా రెండు పథకాలను వెంటనే అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని నాయకులు కొనియా డారు. ప్రజా సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఈ సందర్భంగా పార్టీ నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బాలసాని వేణు, సీనియర్ నాయకులు ప్రముఖ రైతు చిడెం మల్లయ్య, చిడెం ముత్తయ్య, చిట్టెం టాకాయ్య , చిట్టెం సాయి,పల్నాటి ప్రకాశ్ , ఎంపీటీసీ రవి, సీతాదేవి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రమేష్, చిడెం శివ, మద్దుకూరి ప్రసాద్, సుంకరి రంగయ్య నాయుడు, వీరభద్రారం సర్పంచ్ సమ్మక్క, పలువురు కార్యకర్తలు, నాయకులు శ్రీ మతి సోనియాగాంధీ జన్మదినం వేడుకల కార్యక్రమంలో పాల్గొన్నారు.