గొండ్వానా సంక్షేమ పరిషత్ జిల్లా కమిటీ ఎన్నిక.
- గిరిజన సంక్షేమ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి జి.ఎస్పి.డిమాండ్
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని నూగూరు గ్రామంలో ఆదివారం పోతురాజు కోట వద్ద జి. ఏస్. పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి ఆధ్వర్యంలో ములుగు జిల్లా కమిటీ ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా నూగూరు గ్రామానికి చెందిన రేగ గణేష్, ఉపాధ్యక్షులుగా చింత మోహన్, ప్రధాన కార్యదర్శిగా కంతి వెంకటకృష్ణ, కార్యదర్శులు గా మట్టి రమేష్,మడకం రవి, ఎల్లబోయిన ముతేష్, ప్రచార కార్యదర్శిగా పూనెం ప్రతాప్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమిటీ నిర్వాహక సభ్యులు గా పూనేం గోవర్ధన్,పూనెం మునేశ్వరావు, పూనెం సూర్యం లు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం పూనెం సాయి దొర మాట్లాడుతూ గొండ్వానా సంక్షేమ పరిషత్ యెక్క విధి విధానాల గురించి తెలియ జేస్తూ ముఖ్య ఎజెండాలు వివరించారు.
- ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసులకు స్వయంపాలన ఏర్పాటు చేయాలి
- ఏజెన్సీ ప్రాంతంలోని వన్ అఫ్ సెవెంటీ చట్టాన్ని పటిష్టంగా అమలుపరచాలని,
- 3.వ నెంబర్ జీవో చట్టాన్ని తిరిగి అమలు పరచాలి
- పిసా చట్టాన్ని గ్రామంలో బలోపేతం చేయాలి
- ఆదివాసి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి మార్గాలు కల్పించాలని సమావేశం డిమాండ్ చేసింధి.
- కోనేరు రంగారావు గారి కమిటీ సిఫారసు లు అమలు చేయాలి.
- ఏజెన్సీలో గిరిజేనేతరులను మైదానం ప్రాంతాలకు తరలించాలని తీర్మాణం చేశారు.
- ఏజెన్సీలో డిఎస్సీ నిర్వహించాలని, నిరుధ్యోగులకు ఉపాది కల్ఫించాలని కోరారు.
- వెంకటాపురం వాజేడు మండలాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విలీనం చేయాల ని సమావేశం డిమాండ్ చేసింది.
పై అంశాలను ములుగు జిల్లా కమిటీ ఎన్నిక కార్యక్రమంలో చర్చించి, ఆదివాసీల హక్కుల సాధన కోసం ఉద్యమించాలని సమావేశం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో ఆదివాసీ యువత సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం పాలెం ప్రాజెక్టు ఆయకట్టులో సాగునీ రు అందక పొట్ట దశలో ఉన్న వరి పంటలు ఎండి పోతున్నాయని,ఈ విషయంపై గోడ్వాన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో, రైతుల పక్షాన వరి ,మొక్క జొన్న,ఇతర పంటలను కాపాడుకునేందుకు పాలెం ప్రాజెక్టు సాగు నీరు కోసం ఆందోళన కార్యక్రమం నిర్వహించాలని, సమావేశంలో సీనియర్ నాయకులు కోరారు. ఆయకట్టు ఆదివాసి రైతులు, గోడ్వాన సంక్షేమ పరిషత్తు సంఘానికి అన్ని వర్గాలు రైతులు విజ్ఞప్తి చేశారు.
1 thought on “గొండ్వానా సంక్షేమ పరిషత్ జిల్లా కమిటీ ఎన్నిక. ”