గుడుంబా స్థావరాలపై వెంకటాపురం పోలీసులు దాడులు.
– భారీగా బెల్లంపానకం ధ్వంసం.
– పరారైన దొంగ సార వ్యాపారులు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం పాత్రాపురం అటవీ ప్రాంతంలో మంగళవారం వెంకటాపురం పోలీసులు నాటు సారా తయారీ స్థావరాలపై విస్తృతంగా దాడులు నిర్వహించారు. వెంకటాపురం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రేఖ అశోక్ సిఆర్పిఎఫ్, సివిల్ పోలీస్ బృందాలతో స్థావరాలపై దాడులు నిర్వహించారు. పోలీసుల దాడులను ముందే పసిగట్టిన దొంగ సార వ్యాపారులు, తయారీదారులు అడవుల్లోకి పరారయ్యారు. ఈ సందర్భంగా 25 డ్రమ్ములలో పులియపెట్టిన బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. ఎవరైనా నాటు సారా తయారుచేసిన, విక్రయించిన అక్రమంగా మద్యం తరలించిన,అమ్మిన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ఎటువంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలు నిర్వహించిన వారిపై పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా ఎస్సై రేఖ అశోక్ హెచ్చరించారు. గుడుంబా ,అక్రమ మద్యం సమాచారం ఇచ్చిన వారి పేరును గోప్యంగా ఉంచడం జరుగుతుందని, ప్రజలు సమాచారం ఇవ్వాలని, ఈ సందర్భంగా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అశోక్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
1 thought on “గుడుంబా స్థావరాలపై వెంకటాపురం పోలీసులు దాడులు. ”