గిరిజనులకు,గిరిజనేతరులకు బిఆర్ఎస్ ప్రభుత్వంలోనే పోడు పట్టాలు
తెలంగాణ జ్యోతి, నవంబర్ 18, ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి, కొండాయి, ఎక్కెల, భూటారం, ఆకులవారిఘణపురం, ఏటూరు నాగారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు ఆధ్వర్యంలో ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఏజెన్సీ గ్రామాలలోని మహిళలు నాగజ్యోతికి ఎదురై పూలమాలతో ఘనంగా స్వాగతం పలుకుతూ అధిక మెజార్టీతో గెలిపిస్తామని ఆశీర్వదించారు. గ్రామాలలోని గ్రామ దేవతల ఆశీర్వాదంతో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ములుగు జిల్లా ఏజెన్సీలోని యువత ఎమ్మెల్యే అభ్యర్థి నాగజ్యోతికి ఘన స్వాగతం పలుకుతూ ప్రతీ ఎమ్మెల్యే అభివృద్ధి చేసి ఓట్లను అభ్యర్థిస్తారు కానీ, మన ప్రస్తుత ఎమ్మెల్యే మనల్ని చీకట్లో నెట్టేసి మన కష్టాల మీద సినిమాలు తీసి పబ్లిసిటీ చేసుకునే ఎమ్మెల్యే అని వాపోయారు.తమ మద్దతు మీకేనని,ఆమెకు ధీటుగా మీరు వచ్చి,మా గ్రామాలను అభివృద్ది చేయాలని కోరారు.జ్యోతక్క కుటుంబం ఒక విప్లవం అని,ఆ ఆశయం మాకు ఆశాజ్యోతి అని,జ్యోతక్క గెలిచి మాకు జ్యోతినివ్వాలని కోరారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం పై ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వర్తించేలా ఉన్నాయన్నారు. జిల్లాలో ప్రధానంగా గిరిజనులు,గిరిజనేతరులు పోడు వ్యవసాయం పై ఆధారపడి ఉన్నారని,పోడు భూములకు పట్టాలిచ్చే ప్రక్రియ బీఆర్ఎస్ ప్రభుత్వం తీరుస్తుందన్నారు. పేదింటి బిడ్డనైన నాకు పేదల కష్టాలు తెలుసని, మీ ఇంటి ఆడ బిడ్డగా మీ ముందుకొచ్చానని,నన్ను ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్ లను అభ్యర్థించారు.ఈ ప్రచారంలో కొండాయి సర్పంచ్ వెంకన్న,మండల పార్టీ అధ్యక్షుడు గడదాసు సునీల్,మండల మాజీ అధ్యక్షుడు కూనూరు మహేష్,జిల్లా నాయకులు కాకులమర్రి ప్రదీప్ రావు,జెడ్పి కో ఆప్షన్ వలియాబీ,ఏటూరునాగారం సర్పంచ్ ఈసం రామ్మూర్తి,ఎంపిటిసి కోట నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.