కోటగుళ్లలో ఘనంగా గోమాతలకు పూజలు

కోటగుళ్లలో ఘనంగా గోమాతలకు పూజలు

-నందీశ్వరునికి రుద్రాభిషేకం

-దీప దానాలు చేసిన మహిళలు

-బారీగా తరలివచ్చిన భక్తులు

గణపురం, తెలంగాణ జ్యోతి : కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ల ప్రాంగణంలో గోమాతలకు చివరి సోమవారం శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాస ఉత్సవాలలో భాగంగా ఆలయానికి భక్తులు పోటెత్తా రు.   ఉదయం గణపతి పూజతో అర్చకులు నరేష్ కార్యక్రమాలను ప్రారంభించగా అనంతరం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నందీశ్వ రునికి స్వామివారికి రుద్రాభిషేకం పట్టు వస్త్రాలతో ప్రత్యేక అలం కరణ నిర్వహించారు. అనంతరం మహిళలు దీప దానాలు చేయ డంతో పాటు నందీశ్వరుడు, తులసి, మేడీ, రావి ఉసిరి, మారేడు, నాగదేవుని, పుట్ట వద్ద దీపాలను వెలిగించారు. అనంతరం అర్చ కులు నరేష్ భక్తులకు తీర్థ ప్రసాదాలను ఆశీర్వచనాలు అందజే శారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment