కార్తీకమాస ఏకాదశి సంధర్భంగా శివాలయంలో అన్నదానం

కార్తీకమాస ఏకాదశి సంధర్భంగా శివాలయంలో అన్నదానం

– శివస్వాములకు, సాయిబాబా భక్తులకు అన్నప్రసాదం. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: ములుగు జిల్లా మండల కేంద్రమైన వెంకటాపురంలో కొలువై ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం ప్రాంగణంలో శిరిడి సాయి బాబా మందిరం వద్ద గురువారం శివ స్వాములకు, సాయి బాబా భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిం చారు. కార్తీక మాసం గురువారం ఎకాదశి పర్వదినం సందర్భంగా వెంకటా పురం మండల కేంద్రానికి చెందిన షిరిడి సాయిబాబా భక్తుడు వ్యాపారవేత్త, వేల్పూరి శ్రీనివాసరావు గుప్తా దంపతులు శివ స్వాములకు మరియు సాయిబాబా భక్తులకు అన్న ప్రసాద కార్యక్ర మాన్ని నిర్వహించారు. సాయినాధునికి పూజలు నిర్వహిం చి, ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయని సాయినా ధుని నామజయంతో పాటు ఓం నమశ్శి వాయ అంటూ హర హర మహాదేవ శంభో శంకర అంటూ హారతి ఇచ్చి శివ స్వాములకు, సాయిబాబా భక్తులకు అన్నదాన కార్యక్ర మాన్ని ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా శివ స్వాములు, సాయి బాబా భక్తులు అన్నదాత సుఖీభవ అంటూ అన్నదాత అయిన వేల్పూరి శ్రీనివాస రావు గుప్తా శుభం కలగాలని ఆశీర్వచనాలు పలికారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment