కాటారం మండల ఓబీసీ సెల్ అధ్యక్షునికి గా కొట్టే ప్రభాకర్
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: కాటారం మండల కేంద్రానికి చెందిన కొట్టే ప్రభాకర్ ను కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ మండల అధ్యక్షునిగా నియమిస్తున్నట్టు మాజీ మంత్రి వర్యులు, ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఒక ప్రకటన లో తెలిపారు.తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కు,శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ శ్రీను బాబు కు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోట రాజ బాపు , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునురి ప్రభాకర్ రెడ్డికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి మంథని శాసనసభ నియోజకవర్గంలో శ్రీధర్ బాబు గెలుపునకు కృషి చేస్తానని కొట్టే ప్రభాకర్ అన్నారు.